మే 1న జాయెద్ హ్యమానిటేరియన్ వేడుకలు
- May 01, 2021
యూఏఈ: యూఏఈ ఫౌండింగ్ ఫాదర్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ వర్ధంతి నేపథ్యంలో పవిత్ర రమదాన్ మాసం 19వ రోజున జాయెద్ హ్యుమానిటేరియన్ డే (మే 1) నిర్వహించారు. యూఏఈ అభివృద్ధి కోసం జాయెద్ చేసిన మంచి మంచి కార్యక్రమాల్ని ఈ సందర్భంగా యూఏఈ ప్రజలంతా గుర్తు చేసుకుంటున్నారు. గత ఏడాదిలానే ఈ ఏడాది కూడా కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో జాయెద్ గొప్ప ఆలోచనలు, మానవీయ కోణం, చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. 130కి పైగా దేశాలకు 2,000 టన్నుల మెడికల్ ఎయిడ్ మానవీయ కోణంలో పంపించడం జరిగింది. కాగా, యూఏఈ ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతంగా కరోనా వైరస్ భూతాన్ని డీల్ చేయగలిగిందని రూలర్ ప్రతినిథి - అల్ దఫ్రా రీజియన్ అలాగే ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చెప్పారు.మినిస్టర్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ హెస్సా బంట్ ఇస్సా బహుమైద్ మాట్లాడుతూ, ప్రతి ఎమరేటి గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా జాయెద్ నిలిచి వుంటారని చెప్పారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్‌పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్‌లో భారత హై కమిషనర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









