గాంధీ ఆస్పత్రికి 100 ఆక్సిజన్ సిలెండర్లను అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

- May 02, 2021 , by Maagulf
గాంధీ ఆస్పత్రికి 100 ఆక్సిజన్ సిలెండర్లను అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: కోవిడ్ రోగుల కోసం గాంధీ ఆస్పత్రికి డీఆర్డీవో నుంచి 100 ఆక్సిజన్ సిలెండర్లను అందజేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి డీఆర్డీవో మిస్సైల్ డీజీ ఎమ్మెస్సార్ ప్రసాద్, గాంధీ సూపరిండెంట్ రాజారావు హాజరయ్యారు. కిషన్ రెడ్డి తమకు ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే రెస్పాండ్ అవుతున్నారని, డీఆర్డీవో నుంచి వచ్చిన సిలెండర్లతో మరి కొంతమందిని కాపాడుకోగలుగుతామని రాజారావు అన్నారు. కిషన్ రెడ్డి చొరవ వల్లే అన్ని రకాలుగా గాంధీ సేవలందించగలుగుతుందని ఆయన పేర్కొన్నారు. 650 ఐసీయూ పడకలతో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిగా సేవలందిస్తుందని, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి రోగులు వస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల కష్టసుఖాల్లో కేంద్రం తోడు ఎప్పుడూ ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు. గాంధీ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఉండకూడదని సీఎస్ తో తాను మాట్లాడానని కేంద్ర మంత్రి చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com