సన్‌రైజర్స్ హైదరాబాద్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం
- May 02, 2021
న్యూ ఢిల్లీ: ఈరోజు ఢిల్లీ వేదికగా ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ఖాతాలో మరో ఓటమిని వేసుకుంది. అయితే ఈ మ్యాచ్ 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనకి వచ్చిన సన్‌రైజర్స్ ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (31), మనీష్ పాండే(30) పర్వాలేదనిపించిన ఆ తర్వాత ఏ ఆటగాడు కూడా రాణించలేదు. వచ్చిన వారు అందరూ స్వల్ప పరుగుల వ్యవధిలో పెవిలియన్ కు చేరుకుంటూ ఉండటంతో హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేసింది. దాంతో రాజస్థాన్ 55 పరుగుల తేడాతో ఈ ఐపీఎల్ లో మూడో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది.
ఇక అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో కెప్టెన్ సంజు(48) తో రాణించగా ఓపెనట్ బట్లర్(124) సెంచరీ పూర్తి చేసాడు. దాంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు సాధించింది రాయల్స్.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







