కోవిద్ కంట్రోల్ రూమ్ ద్వారా వైద్య సహాయాలు,సూచనలు
- May 03, 2021
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో కోవిద్ సంబంధిత వైద్య సహాయాన్ని, కోవిద్ పాజిటివ్ వస్తే చేపట్టాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన మందులు తదితర సలహాలు సూచనలను అందించేందుకై జీహెచ్ఎంసీ కోవిద్ కంట్రోల్ రూమ్ నుండి వైద్యులను ప్రత్యేకంగా నియమించారు. ప్రతీ రోజు ఉదయం 8 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరిగి రెండు గంటలనుండి రాత్రి 8 గంటల వరకు రెండు షిఫ్తులలో ఈ వైద్యులు కంట్రల్ రూమ్ నుండి ఫోన్ ల ద్వారా కోవిద్ నివారణకై సలహాలు సూచనలిస్తారు. కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వర్తించే వైద్యులకు నేడు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రత్యేక ఓరియెంటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య శాఖ కార్యదర్శి రిజ్వి, ఎస్.సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ కలెక్టర్ సంతోష్, వైద్య శాఖ ఓ.ఎస్.డి. గంగాధర్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైద్య శాఖ కార్యదర్శి రిజ్వి మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిద్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం యుద్దప్రాతిపాదక చర్యలు చేపడుతోందని అన్నారు. దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి దీనిలో 040 - 21111111 అనే నెంబర్ ను ఏర్పాటు చేశామని అన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో కోవిద్ లక్షణాలుంటే, తగు వైద్య సలహాలు సూచనలకు, కావాల్సిన వైద్య కిట్ లకై ఫోన్ చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం 104 కు వచ్చే కాల్స్ లను కూడా కోవిద్ కంట్రోల్ రూమ్ నెంబర్ కు అనుసందానం చేస్తున్నట్లు రిజ్వి తెలిపారు. కోవిద్ లక్షణాలుంటే వెంటనే టెస్టులనీ, పరీక్షలనీ, స్కాన్ లని వెళ్లోద్దని ముందస్తుగా ఐదు రోజులపాటు మందులు వాడాలని వైద్య శాఖ ఓ.ఎస్.డి గంగాధర్ సూచించారు. అవసరమైన వారికి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల ద్వారా మెడికల్ కిట్ లను అండ చేస్తున్నట్టు రాహుల్ బొజ్జా అన్నారు. అనంతర, జీహెచ్ఎంసీ కోవిద్ కంట్రోల్ రూమ్ ను వైద్య శాఖ కార్యదర్శి రిజ్వి సందర్శించారు. కంట్రోల్ రూమ్ పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









