భారత్ లో కరోనా కేసుల వివరాలు
- May 04, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.ప్రతిరోజూ మూడున్నర లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.కరోనా కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది.తాజాగా భారత్ లో 3,57,229 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,82,833కి చేరింది.ఇందులో 1,66,13,292 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,47,133 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.దేశంలో రెండు కోట్లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నట్టు సమాచారం.ఇక గడిచిన 24 గంటల్లో 3,20,289 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక ఇదిలా ఉంటె, 24 గంటల్లో భారత్ లో కరోనాతో 3,449 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,22,408కి చేరింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







