భార‌త్ కు బాస‌ట‌గా నిలిచిన ఖ‌తార్ లోని ఇండియ‌న్ క‌మ్యూనిటీ

- May 04, 2021 , by Maagulf
భార‌త్ కు బాస‌ట‌గా నిలిచిన ఖ‌తార్ లోని ఇండియ‌న్ క‌మ్యూనిటీ

దోహా: కోవిడ్ సెకండ్ వేవ్ సృష్టిస్తున్న మార‌ణ‌హోమంతో ఖ‌తార్ లోని భార‌తీయ స‌మాజం చ‌లించింది. ఈ క‌ష్ట స‌మ‌యంలో మాతృదేశ పౌరుల‌కు బాస‌ట‌గా త‌మ వంతు సాయం అందించింది. కోవిడ్ పేషెంట్ల‌కు అత్య‌వ‌స‌రంగా మారిన ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, ఆక్సిజ‌న్ కాన్సంట్రెట్ల‌ను పంపిస్తోంది. ప్ర‌స్తుతం ఖ‌తార్ లో ఉన్న భార‌త్ నేవీకి చెందిన నౌక ద్వారా 200 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, 43 ఆక్సిజ‌న్ కన్సంట్రెట్ల‌ను త‌ర‌లిస్తోంది. ఈ మేర‌కు వైద్య‌సామాగ్రిని ఇండియ‌న్ క‌మ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరం- ఐసీబీఎఫ్‌కి అందించింది. సంక్షోభ స‌మ‌యంలో మాతృదేశానికి త‌మ వంతు సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చిన ఖ‌తార్ ఇండియ‌న్ క‌మ్యూనిటీకి ఐసీబీఎఫ్ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసింది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com