భారత్ కు బాసటగా నిలిచిన ఖతార్ లోని ఇండియన్ కమ్యూనిటీ
- May 04, 2021
దోహా: కోవిడ్ సెకండ్ వేవ్ సృష్టిస్తున్న మారణహోమంతో ఖతార్ లోని భారతీయ సమాజం చలించింది. ఈ కష్ట సమయంలో మాతృదేశ పౌరులకు బాసటగా తమ వంతు సాయం అందించింది. కోవిడ్ పేషెంట్లకు అత్యవసరంగా మారిన ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రెట్లను పంపిస్తోంది. ప్రస్తుతం ఖతార్ లో ఉన్న భారత్ నేవీకి చెందిన నౌక ద్వారా 200 ఆక్సిజన్ సిలిండర్లు, 43 ఆక్సిజన్ కన్సంట్రెట్లను తరలిస్తోంది. ఈ మేరకు వైద్యసామాగ్రిని ఇండియన్ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరం- ఐసీబీఎఫ్కి అందించింది. సంక్షోభ సమయంలో మాతృదేశానికి తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చిన ఖతార్ ఇండియన్ కమ్యూనిటీకి ఐసీబీఎఫ్ ధన్యవాదాలు తెలియజేసింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







