17 ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో ఉచిత కోవిడ్ వ్యాక్సినేష‌న్‌..దుబాయ్ కీలక నిర్ణయం

- May 05, 2021 , by Maagulf
17 ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో ఉచిత కోవిడ్ వ్యాక్సినేష‌న్‌..దుబాయ్ కీలక నిర్ణయం

దుబాయ్: వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయ‌టంతో పాటు విస్తృతం చేసేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టింది దుబాయ్‌. ఇందులో భాగంగా 17 ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో వ్యాక్సినేష‌న్ కు అనుమ‌తి ఇచ్చింది. ఇక నుంచి దుబాయ్ హెల్త్ అథారిటీ సెంట‌ర్ల‌తో పాటు ఈ 17 ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో కూడా ఉచితంగా వ్యాక్సిన్ పొంద‌వ‌చ్చు. దుబాయ్ పౌరులు, రెసిడెన్సీ హోల్డ‌ర్లు, ఎమిరాతి గుర్తింపు కార్డు ఉన్న‌ జీసీసీ దేశాల పౌరుల‌తో పాటు 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారు, ఇత‌ర ఎమిరాతి పౌరులు కూడా వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చ‌ని దుబాయ్ ఆరోగ్య శాఖ స్ప‌ష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకోవాల‌ని అనుకునేవారు డీహెచ్ఏ యాప్ డౌన్ లోడ్ చేసుకొని ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. 60 ఏళ్ల‌కుపైబ‌డిన వ్య‌క్తులు అయితే 800342కి ఫోన్ చేసి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం ఫైజ‌ర్ బ‌యోన్టెక్‌, సినోఫార్మ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయ‌ని దుబాయ్ ఆరోగ్య శాఖ స్ప‌ష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com