'సావిత్రి' చిత్రం ఆడియో విడుదలకి... బాలకృష్ణ ముఖ్య అతిథి

- March 04, 2016 , by Maagulf
'సావిత్రి' చిత్రం ఆడియో విడుదలకి... బాలకృష్ణ ముఖ్య అతిథి

 నారా రోహిత్‌, నందిత జంటగా నటించిన చిత్రం 'సావిత్రి'. శుక్రవారం నిర్వహించనున్న ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకలకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని కథానాయకుడు నారా రోహిత్‌ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. పవన్‌ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజన్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ పతాకంపై వి.బి. రాజేంద్ర ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. శ్రావణ్‌ సంగీతం సమకూర్చారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com