ఏపీ కరోనా అప్డేట్

- May 06, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజుకు వెయ్యికి పైగా కేసులు పెరుగుతున్నాయి.తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 21,954 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,28,186 కు చేరింది.ఇందులో 10,37,411 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,82,329 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 72 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 8,446 మంది మృతి చెందారు.ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,141 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 1,10,147 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com