ఉద్దేశపూర్వకంగా వైరస్ వ్యాప్తికి కారణమైతే లక్ష దిర్హామ్ ల జరిమానా
- May 07, 2021
యూఏఈ: మానవాళికి అత్యంత ప్రమాదకరంగా మారిన కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రజలు తమ వంతు బాధ్యతను నిర్వహించాలని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ పిలుపునిచ్చింది. ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వైరస్ వ్యాప్తికి కారణమైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కావాలని వైరస్ వ్యాప్తి చేసినట్లు నిరూపణ అయితే..50 వేల నుంచి లక్ష దిర్హామ్ ల వరకు జరిమానా, గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్షను ఎదుర్కొవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. తీవ్రతను బట్టి జైలు శిక్ష, జరిమానా రెండు విధిస్తామని వెల్లడించింది. ఒక వేళ అదే తప్పును మళ్లీ చేస్తే శిక్ష రెట్టింపు అవుతుందని తెలిపింది. ఇదిలాఉంటే వైరస్ ఉన్నట్లు అనుమానం ఉన్నా, లక్షణాలు కనిపించినా ఆ విషయాన్ని అధికారులకు తెలియజేకుండా దాచిపెట్టే ప్రయత్నం చేయటం కూడా తప్పేనని..అందుకు జైలు శిక్ష లేదా 10 వేల నుంచి 50 వేల దిర్హామ్ ల వరకు జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







