కోస్ట్ గార్డ్ పాట్రోలింగ్ బోటును ఢీ కొట్టిన పడవ..ముగ్గురు మృతి
- May 07, 2021
బహ్రెయిన్: అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్న కొందరు వ్యక్తులు..తమ పడవతో కోస్ట్ గార్డ్ పాట్రోలింగ్ పడవను ఢీ కొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా..మరో ఇద్దరు గాయపడ్డారు. చనిపోయిన వారు కోస్ట్ గార్డ్ సిబ్బందిగా తెలుస్తోంది. షహ్రాఖాన్ బీచ్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్న వారిని నిలువరించేందుకు కోస్ట్ గార్డ్ టీం ప్రయత్నించింది. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు కోస్ట్ గార్డ్ బోటును తమ పడవతో ఢీకొట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులైన ఆసియన్లను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరు పలు నిబంధనలు ఉల్లఘించారని, పడవ రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ డివైజ్ ను స్విచ్ఛాఫ్ చేయటం ఇలా పలు నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







