'ప్రాజెక్ట్ Z" సీక్వెల్
- May 07, 2021
హైదరాబాద్: యంగ్ హీరో సందీప్ కిషన్ బర్త్ డే నేడు.ఈ సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు నిర్మాతలు.ఈ క్రమంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'మాయావన్'కు సీక్వెల్ ను ప్రకటించారు.మేకర్స్. సి. వి. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించగా, జాకీ ష్రాఫ్, డేనియల్ బాలాజీ కీలకపాత్రలు పోషించారు.2017 డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మాయావన్' యావరేజ్ గా నిలిచింది.ఈ చిత్రాన్ని తెలుగులో 'ప్రాజెక్ట్ Z" పేరుతో డబ్ చేశారు. తెలుగులోనూ పెద్దగా స్పందన రాలేదు ఈ చిత్రానికి. తాజాగా 'మాయావన్' చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. తమిళంలో 'మాయావన్ రీలోడెడ్' అంటూ సినిమా టైటిల్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. తిరుకుమారన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రానికి మొదటి భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు సివి కుమార్ దర్శకత్వం వహించారు.ఈ సీక్వెల్ ను తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







