వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులకు పిసిఆర్ టెస్ట్ అవసరం లేదు
- May 07, 2021
బహ్రెయిన్: కోవిడ్ - 19 నేషనల్ మెడికల్ టీమ్, ఈద్ అల్ ఫితర్ తొలి రోజు నుంచి ఎవరైతే ప్రయాణీకులుంటారో, అలాంటివారిలో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వున్నవారికి పీసీఆర్ టెస్ట్ అవసరం లేదని స్పష్టంచేసింది. అయితే, పూర్తి వ్యాక్సినేషన్.. అంటే రెండు డోసుల్నీ ఆయా ప్రయాణీకులు తీసుకుని, నిబంధనలకు అనుగుణంగా వ్యాక్సినేషన్ తర్వాత తగిన సమయాన్ని వారు పూర్తి చేసి వుండాలి. దేశంలోకి వచ్చే ప్రయాణీకులు తమ వెంట వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా, కరోనా నుంచి కోలుకున్నదానికి సంబంధించిన సర్టిఫికెట్ సమర్పించాల్సి వుంటుంది. జిసిసి మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా వీటిని సమర్పించవచ్చు. యూకే, ఈయూ, అమెరికా, కెనడా వంటి దేశాల్లో వ్యాక్సినేషన్ పొందినవారికి సర్టిఫికెట్లు ఇస్తున్నారు. వాటిని సమర్పించాల్సి వుంటుంది. ఆ సర్టిఫికెట్ లేనివారు పిసిఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాలి. అలాగే వారికి ప్రత్యేకంగా కరోనా టెస్టులు వచ్చిన తర్వాత నిర్వహిస్తారు. ఐసోలేషన్ తప్పనిసరి. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల నుంచి వచ్చే ట్రాన్సిట్ ప్రయాణీకులు పిసిఆర్ నెగెటివ్ టెస్ట్ తెచ్చుకోవాలి. అదీ ప్రయాణానికి 48 గంటల ముందు చేయించుకున్న పరీక్ష ఫలితం అవ్వాలి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







