రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు వెల్లడించిన పోలీసులు
- May 09, 2021
అబుధాబి: అడ్డదిడ్డంగా వాహనాలను నడపటం, అతి వేగం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అబుధాబి పోలీసులు అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు దారితీసిన ప్రధాన కారణాలను వివరించారు. రోడ్డుపై వాహనాలను నడుపుతున్న సమయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పాటలు వింటూ డ్యాన్సులతో డ్రైవ్ చేయటం, మొబైల్ ఫోన్లో మాట్లాడటం, తినడం, త్రాగటం, సోషల్ మీడియాలో మునిగిపోయి డ్రైవింగ్ పై ధ్యాస లేకుండా పోవటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అలాగే డ్రైవింగ్ సమయంలో ఫోటోలు తీయడం, మేకప్ ఫిక్సింగ్ చేయడం, దుస్తులు సర్దుబాటు చేసుకుంటూ స్టీరింగ్ పై పట్టు కొల్పోతున్నారని, అలాంటి సమయాల్లోనూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







