మృతులకు రూ.10 లక్షలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- May 09, 2021
ఏపీ: మామిళ్ళపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేస్తున్నామని గనులు, భూగర్భశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.5 ప్రభుత్వశాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు చేశామని..అయిదు రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక వస్తుందని ఆయన వెల్లడించారు.తక్షణం నష్టపరిహారం కింద మృతులకు రూ.10 లక్షలు,గాయపడిన వారికి రూ.5 లక్షలు ప్రకటిస్తున్నామన్నారు.లీజుదారుడిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని.. ఘటనాస్థలాన్ని డిఎంజి నేతృత్వంలో వెంటనే మైనింగ్ అధికారులు పరిశీలించారని ఆయన తెలిపారు.క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు. పేలుడు పదార్థాల అన్‌లోడింగ్‌లో నిబంధనలు పాటించలేదని..ఏపీ చిన్న తరహా ఖనిజ నియమావళి 1966, MMD&R Act, 1957 ప్రకారం లీజుదారు పై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







