వారిపై కఠిన చర్యలు తప్పవు: ఏపీ డీజీపీ
- May 09, 2021
విజయవాడ: కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. నగరంలో ఆయన ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. కర్ఫ్యూ అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, అందరూ రెండు మాస్క్లు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. జాగ్రత్తలు పాటించడం ద్వారానే కరోనాను జయిస్తామని పేర్కొన్నారు.
కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేవారి కోసం రేపటి నుంచి ఈ-పాస్ విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదని డీజీపీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు.
కరోనా లక్షణాలను గుర్తించిన వారు, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 104,108 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీజీపీ పేర్కొన్నారు. శుభ కార్యాలకు సంబంధించి ప్రభుత్వం పేర్కొన్న సంబంధిత స్థానిక అధికారుల వద్ద నిబంధనల మేరకు తప్పనిసరిగా అనుమతి పొందాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







