అత్యున్నత సేవలు అందించిన నర్సుకు భారీ నగదు బహుమతి
- May 10, 2021
అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆస్టర్ డియం హెల్త్ కేర్ సంస్థకు చెందిన ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు ను ప్రారంభిస్తున్నారు.ఈ అవార్డు క్రింద ఎంపికైన నర్సుకు US $ 250,000 నగదు బహుమతి ఇవ్వనున్నారు.ఇందుకు సంబంధించిన ధరఖాస్తులను http://www.Asterguardians.com వెబ్ సైట్ ద్వారా రేపటి నుండి స్వీకరించనున్నారు.
ఈ అవార్డును ప్రపంచ వ్యాప్తంగా రోగులకు ఆరోగ్య సేవలు అందించడంలో ప్రపంచ వ్యాప్తంగా నర్సుల చేస్తున్న కృషికి గుర్తింపుగా ఇవ్వాలని ఆస్టర్ డియం హెల్త్ కేర్ సంస్థ తీసుకొన్న నిర్ణయంలో భాగంగా ఈ ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు ఇవ్వడం జరుగుతోంది. ప్రస్థుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు కోవిడ్ మహమ్మారిపై పోరాడుతున్న నేపధ్యంలో ఎంతో ధైర్యంగా, తమ ప్రాణాలు కూడా పణంగా పెట్టి ఆరోగ్య సేవలు అందిస్తున్న నర్సింగ్ సిబ్బందికి తగిన గౌరవం, గుర్తింపు తీసుకొని రావడానికి ఇది దోహదపడనుంది.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకోదలచిన నర్సింగ్ సిబ్బంది (ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వారైనా) స్వయంగా నేరుగా గాని లేదా ఇతరుల ద్వారా సంబంధిత సమాచారాన్ని తగిన ఆధారాలతో వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ అవార్డు ను ప్రకటిస్తున్న సంధర్భంగా డా.ఆజాద్ మూపెన్, వ్యవస్థాపక ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, ఆస్టర్ డియం హెల్త్ కేర్ వారు మాట్లాడుతూ రోగికి ఆరోగ్య సేవలను అందించడంలో నర్సింగ్ సిబ్బంది వెన్నుముక వంటి వారని,వారు అందించే ప్రొఫెషనల్ మరియు వ్యక్తిగత సంరక్షణ ద్వారా రోగంతో భాదపడుతున్న వ్యక్తి సాధారణ స్థాయికి చేరుకోవడంలో ఎంతో కీలక పాత్ర వహిస్తున్నారని అన్నారు.రోగిని పూర్తి స్థాయి సాధారణ స్థితికి తీసుకొని రావడానికి జరిగే ప్రక్రియకు నర్సింగ్ సిబ్బందే సంరక్షకులుగా వ్యవహరిస్తారని అన్నారు.ప్రస్థుత మహమ్మారి కాలంలో కూడా ఎందరో నర్సింగ్ సిబ్బంది నిబద్దతతో, ఎక్కువ పని గంటలు పని చేస్తూ ఎంతో మక్కువతో పని చేస్తున్నారని పేర్కొన్నారు.తమ కుటుంభ సభ్యుల కన్నా రోగుల ఆరోగ్యానికి వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనడంలో సందేహం లేదని అన్నారు. అయినప్పటికీ వీరు చేస్తున్న కృషికి అన్ని సందర్భాలలో గుర్తింపు లభించడం లేదని అభిప్రాయపడ్డారు.అందుకే ఈ ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు ద్వారా వీరు చేస్తున్న కృషి, త్యాగాలకు తగిన గుర్తింపు తీసుకొని రావాలని నిర్ణయించామని వివరించారు.
ఆసియా, ఆప్రికా,మధ్య ప్రాచ్యం(గల్ఫ్),యూరప్, USA, కెనడా, దక్షిణ అమెరికా,ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల వారిగా నర్సింగ్ సిబ్బంది నుండి ఈ దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది.ఇలా స్వీకరించిన దరఖాస్తులను కఠినమైన నిబందనల మధ్య ఒక తర్డ్ పార్టీ ఏజన్సీ ద్వారా పరిశీలించి అటు పిమ్మట నిపుణులైన జ్యూరీ వారికి అందజేయడం జరుగుతుంది.నిర్థేశించబడిన అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా ఎంపిక చేయబడిన ధరాఖస్తులను ఓటింగ్ ప్రక్రియ ద్వారా 10 మంది ఫైనలిస్టుల ఎంపిక జరుగుతుంది.ఈ పది మంది ఫైనలిస్టుల ఎంపిక జ్యూరీ సభ్యుల ద్వారా ప్రత్యేకమైన ఇంటర్వూలు చేయడం ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది.ఇలా ఎంపిక చేయబడిన 10 మంది ఫైనలిస్టుల నుండి ఒకరిని తుది ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డుకు ఎంపిక చేసి వారికి US $ 250,000 నగదు బహుమతి ఇవ్వడంతో పాటు మిగిలిన తొమ్మిది మందికి కూడా భారీ నగదు బహుమతులతో పాటు అవార్డును ఇవ్వడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









