క్వారంటైన్ ఖర్చులు కలిపి టికెట్ ధరలు..ఎయిర్ లైన్స్ కు సౌదీ ఆదేశాలు
- May 11, 2021
సౌదీ: సౌదీ అరేబియా వచ్చే ప్రయాణికుల కోసం క్వారంటన్ నిబంధనల్లో సవరణలు ప్రకటించింది కింగ్డమ్ ప్రభుత్వం. ఇక నుంచి సౌదీ చేరుకునే ప్రయాణికులు అందరూ నిర్ణీత 7 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి, క్వారంటైన్ ఖర్చులు సదరు ఎయిర్ లైన్స్ భరించాల్సి ఉంటుంది. అయితే..క్వారంటైన్ కు అయ్యే ఖర్చును టికెట్ ధరలో జోడించి ప్రయాణికుల దగ్గర్నుంచి ముందస్తుగానే వసూలు చేసుకోవాలని కూడా కింగ్డమ్ పౌరవిమానయాన సంస్థ అధికారులు స్పష్టం చేశారు.అంటే..వ్యాక్సిన్ వేసుకోని వాళ్లందరూ టికెట్ కొనుగోలు చేసే సమయంలోనే క్వారంటైన్ కు అయ్యే ఖర్చులను కూడా కలిపి చెల్లించాల్సి ఉంటుంది.దీంతో ప్రయాణికులను సౌదీకి తీసుకురావటంతో పాటు వారిని క్వారంటైన్ కు పంపే బాధ్యతను కూడా ఎయిర్ లైన్స్ బాధ్యత కిందకు తీసుకువచ్చింది జీఏసీఏ.ఈ మేరకు క్వారంటైన్ సౌకర్యాలను అందిస్తున్న పర్యాటక శాఖతో అవగాహన కుదర్చుకోవాలని కూడా జీఏసీఏ స్పష్టం చేసింది. ఇదిలాఉంటే..వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రం క్వారంటైన్ రూల్ వర్తించవు. వారికి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు.ఇక సౌదీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల్లో 8 సంవత్సరాలకు పైబడిన వాళ్లందరూ కోవిడ్ నెగటీవ్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







