శ్రీలంక పై పాకిస్తాన్ విజయం

- March 04, 2016 , by Maagulf
శ్రీలంక పై పాకిస్తాన్ విజయం

ఆసియాకప్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు ఉండగానే పాక్ లక్ష్యాన్ని ఛేరుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ షార్జిల్ ఖాన్(24 బంతుల్లో 31), సర్ఫరాజ్ అహ్మద్ (27 బంతుల్లో 38), ఊమర్ అక్మల్(48: 4 ఫోర్లు, 2 సిక్సులు) రాణించడంతో పాక్ తన చివరి మ్యాచ్ లో గెలుపొందింది. ఊమర్ అక్మల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే, ఈ జట్లు ఇప్పటికే ఇంటి దారి పట్టాయి. మార్చి 6న జరగనున్న ఫైనల్లో బంగ్లాదేశ్, భారత్ తలపడనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com