రుయా మృతలకు రూ.10 లక్షల పరిహారం

- May 11, 2021 , by Maagulf
రుయా మృతలకు రూ.10 లక్షల పరిహారం

తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక  నిన్న రాత్రి 11 మంది మరణించిన సంగతి తెలిసిందే.కోవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో 11 మంది కరోనా రోగులు మృతి చెందారు.ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ తగ్గటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని..దీని కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.అయితే ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఇక తాజాగా..రుయా మృతలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు సిఎం జగన్. బాధిత కుటుంబాలకు అన్ని రకాల అండగా ఉంటామని సిఎం జగన్ హామీ ఇచ్చారు. అటు ఈ ఘటనతో ఆక్సిజన్ పై ఏపీ ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది.ముగ్గురు సీనియర్ అధికారులకు ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలకు ముగ్గురు అధికారులను నియమించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com