ఏపీకి చేరుకున్న రెండులక్షల కోవాగ్జిన్ టీకాలు

- May 11, 2021 , by Maagulf
ఏపీకి చేరుకున్న రెండులక్షల కోవాగ్జిన్ టీకాలు

అమరావతి: హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న వ్యాక్సిన్లను గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి తరలించారు అధికారులు. ఈ కేంద్రం నుంచి వివిధ జిల్లాలకు టీకాలను పంపిణీచేయనున్నారు. ఏపీలో కరోనాకట్టడికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం వేగంగా అమలు చేయాలనుకుంటున్నప్పటికీ… టీకాల కొరత అడ్డంకిగా మారుతున్నది.

ఇటీవల వ్యాక్సిన్లు పంపాలంటూ ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు కూడా రాశారు. వీటిని గన్నవరంలోని వ్యాక్సిన్ నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వివిధ జిల్లాలకు పంపిణీ చేయనున్నారు. మరోవైపు, వ్యాక్సిన్ ను ఫార్మా కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో, ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com