యూఏఈ: 7 వర్గాలకు వ్యాక్సిన్ నుంచి మినహాయింపు
- May 12, 2021
యూఏఈ: కోవిడ్ వ్యాక్సిన్ నుంచి 7 వర్గాలకు మినహాయింపు ఇచ్చింది యూఏఈ. ఈ మేరకు అబుధాబి అత్యవసర, విపత్తు నిర్వహణ కమిటీ సహకారంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ ఏడు వర్గాలకు మినహాయింపు వర్తింప చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గర్భిణిలు, ఇతర దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నవారు, కోవిడ్ పేషెంట్లు, క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్నవారు, కోవిడ్ నుంచి కోలుకొని మెడికేషన్ లో ఉన్నవారు, తొలి డోసు వ్యాక్సిన్ సమయంలో అలర్జీలు వచ్చిన వారు, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతూ వ్యాక్సిన్ తో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్న వారికి కోవిడ్ వ్యాక్సిన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. మినహాయింపు పత్రాలను పొందాలనుకునే వారు అబుధాబి ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి డాక్టర్లను సంప్రదించి మినహాయింపు పత్రం తీసుకోవాలి. మెడికల్ సెంటర్ ద్వారా అల్ హోస్న్ యాప్ లో మినహయింపు పత్రాన్ని అప్ డేట్ అవుతుందని అదికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







