భారత్ కు సాయంగా వైద్య పరికరాలు పంపిన ఒమన్
- May 13, 2021
మస్కట్: కోవిడ్ 19 వేరియంట్లతో పోరాటం చేస్తున్న భారత్ కు బాసటగా నిలుస్తామని ప్రకటించిన ఒమన్ ప్రభుత్వం..ఆ మేరకు తమవంతు సాయంగా వైద్య పరికరాలను పంపింది. వెంటిలేటర్లు, SPO2 మానిటర్లు, ఇతర వైద్య పరికరాలతో కూడిన రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానం ఒమన్ నుంచి బయల్దేరి భారత్ చేరుకుంది. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలకు చేదోడుగా నిలబడటం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు ఒమన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..ఒమన్ సాహయాన్ని స్వాగతించిన భారత్..సంక్షోభ సమయంలో మద్దతుగా నిలబడి రెండు దేశాల చిరకాల మిత్రత్వాన్ని, స్నేహశీలతను మరోసారి చాటినట్లు అయ్యిందని అభిప్రాయపడింది. ఒమన్ ప్రభుత్వం, ప్రజలకు ధన్యవాదాలు వ్యక్తం చేసింది. అలాగే ఒమన్ లోని ప్రవాస భారతీయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. మాతృదేశ ప్రజల కోసం ఒమన్ లోని ప్రవాస భారతీయులు 100 అక్సిజన్ సిలిండర్లు, 30 ఆక్సిజన్ కాన్సంట్రేట్లు పంపించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







