‘జగనన్న ప్రాణవాయువు’ రథచక్రాలు ప్రారంభం
- May 13, 2021
తూర్పుగోదావరి: రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ‘‘జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు’’ వాహనాలను ఎంపీ మార్గాని భరత్ గురువారం ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ పద్ధతికి ఆయన శ్రీకారం చుట్టారు. మొదటిసారిగా రాజమహేంద్రవరంలో కోవిడ్ బాధితులకు బస్సులో వైద్యమందించే విధానం విజయవంతమైతే ఎంపీ భరత్‌రామ్ దీన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 36 సీట్లు సామర్థ్యం గల ఈ బస్సులో ఆరు పడకలను ఏర్పాటు చేశారు.
రెండు బస్సులను సిద్ధం చేయగా వాటిలో మొత్తం 12 బెడ్లు అందుబాటులో ఉంటాయి. వీటికి ఆక్సిజన్ సదుపాయం ఏర్పాటు చేసి మినీ ఐసీయూలా తయారుచేశారు. ఆసుపత్రిలో బెడ్ లేక ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడేవారికి బెడ్ దొరికేవరకు ఈ బస్సులో ఉంచి ఆక్సిజన్ అందించనున్నారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ గ్యారేజ్‌లోంచి రెండు వెన్నెల బస్‌లను ఈ సేవలకు వినియోగిస్తున్నారు. చాలామంది ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు రూపకల్పన చేసినట్టు ఎంపీ భరత్‌రామ్ తెలిపారు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







