జనాలకు సేవ చేసే ఉద్దేశం నాకు లేదు: వర్మ
- May 13, 2021
హైదరాబాద్: తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. 'నేను రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు. ఎందుకంటే జనాలకు సేవ చేసే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నాకు నేను సేవ చేసుకోవడానికే టైమ్ సరిపోవడం లేదు. ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్న వారే పాలిటిక్స్ లోకి వస్తారు. నేను అది కాదు. సహజంగా ఏ నేత అయినా పవర్, ఫేమ్ కోసం రాజకీయాల్లోకి అడుగుపెడతాడు. కానీ ప్రజాసేవ అని పైకి చెబుతాడు' అని వర్మ తెలిపాడు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ తాజా రాజకీయ పరిస్థితులపై విమర్శలు చేస్తూ వర్మ వరుస పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన రాజకీయాలపై ఈ విధంగా స్పందించారు. ఇక ఓటీటీ అనేది రానున్న రోజుల్లో ప్రజలకు ఎంతగానో చేరువకానుందని వర్మ తెలిపాడు. తనకి తెలిసిన ఓ వ్యక్తితో కలిసి త్వరలోనే ఓటీటీని ప్రారంభిస్తున్నానని, మే 15న అది ప్రారంభం కానుందని వెల్లడించాడు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్‌పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్‌లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









