విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు..
- May 14, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.విదేశాల నుంచి వారిపై ఆంక్షలు విధించింది.రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కోవిడ్ నిర్ధారణకు ఆర్‌టీపీసీఆర్(RTPCR) పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్న నిబంధన విధించింది. ఎయిర్‌పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి క్వారంటైన్ గైడ్‌లైన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఇందులో భాగంగా కోవిడ్ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు విధిగా 14 రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలని సూచించింది. మిగిలిన వారు హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని పేర్కొంది.అలాగే, రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు 72 గంటల ముందు కోవిడ్ నెగెటివ్ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దేశీయ ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త మార్గదర్శకాలు అమలులోకి తీసుకువచ్చినట్లు ఎయిర్‌పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా వెల్లడించింది..
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







