తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ…
- May 19, 2021
తిరుమల: కరోనా కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది.వేసవిలో తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శించుకునేవారు.కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధించడంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావడం లేదు.బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లే వరకు తెలియని భయమే.పైగా ఏపీలో కర్ఫ్యూ సడలింపులు సమయం కేవలం 6 గంటలే కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇక నిన్నటి రోజున తిరుమల శ్రీవారిని కేవలం 3,485 మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు.వీరిలో 1379 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.నిన్నటి రోజున శ్రీవారి హుండీ ఆదాయం రూ. 22 లక్షలుగా ఉంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







