పర్యాటక కేంద్రంగా తాళ్లపాలెం బీచ్ అభివృద్ధికి కృషి--- మంత్రి కొల్లు రవీంద్ర

- March 05, 2016 , by Maagulf
పర్యాటక కేంద్రంగా తాళ్లపాలెం బీచ్ అభివృద్ధికి కృషి--- మంత్రి కొల్లు రవీంద్ర

    
తాళ్లపాలెం బీచ్‌ను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖామంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. శుక్రవారం రెవెన్యూ పంచాయతీరాజ్‌, టూరిజం సంబంధిత అధికారులతో కలిసి మంత్రి బీచ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా బీచ్‌లో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. బీచ్‌లో ఎంట్రన్స్‌ ఆర్చి ఏర్పాటు, సీ ఫ్రంట్‌లో సుమారు 25 ఎకరాలను ఉపాధిహామీ కింద సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో మెరక చేసేందుకు, బీచ్‌ రోడ్డును సముద్రపు ఒడ్డువరకూ డబుల్‌ లైన్‌గా అభివృద్ధి పరచడం, రోడ్డుకిరువైపులా పార్కు అభివృద్ధి చేయడం, యాత్రికులకు సౌకర్యాలు మెరుగుపరచడం, బీచ్‌ ఎదురుగా ఉన్న 150 ఎకరాల్లో రిసార్ట్స్‌ ఏర్పాటు తదితర టూరిజం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకోసం టూరిజం శాఖకు రెండు కోట్లు మంజూరయ్యాయన్నారు. సత్రవపాలెం రోడ్డుకు కలిపే విధంగా రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. వచ్చే ఏప్రిల్‌, మే మాసాల్లో బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లు దీనికోసం విశాఖ, కాకినాడలో జరిగిన బీచ్‌ ఉత్సవాలు, హిందూపురంలో నిర్వహించిన లేపాక్షి ఉత్సవాలు మాదిరిగా ఇక్కడ కూడా అనేక ఈవెంట్స్‌తో నిర్వహించడానికి టీమ్‌ తయారుచేశామన్నారు. ప్రపంచానికి తెలిసే విధంగా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి లంకె నారాయణప్రసాద్‌, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, ఆర్‌డిఒ పి.సాయిబాబు, మండల ఉపాధ్యక్షులు ఊసా వెంకటసుబ్బారావు, ఎంపిటిసి నాగమల్లేశ్వరరావు, తహశీల్దార్‌ బి.నారదముని, ఎంపిడిఒ జి.వి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com