సంక్షేమాన్ని ఆపలేదు: ఏపీ గవర్నర్
- May 20, 2021
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది.కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి రాజభవన్ నుంచే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్‌గా ప్రసంగించారు. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రంగా ఉందన్నారు. వైరస్ బారిన పడి మృతిచెందిన వారికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొవిడ్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో అదనంగా కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీని కొవిడ్ చికిత్సలో చేర్చామన్నారు.
ఆరోగ్యశ్రీకి ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని గవర్నర్ తెలిపారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌ను ఆయన అభినందించారు. కరోనాతో ఆర్థిక రంగంపై మరోసారి ప్రభావం పడిందని..అయినా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఆపలేదని చెప్పారు. నాడు-నేడు, వసతి దీవెన, జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ చేయూత తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు గవర్నర్ వివరించారు. జాతీయ గీతాలాపనతో గవర్నర్ ప్రసంగం ముగిసింది.

కాసేపట్లో సభావ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సభలో చర్చించనున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రూ.2.30లక్షల కోట్లతో 2021-22 రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో సీనియర్ మంత్రుల్లో ఒకరు శాసనమండలిలో ప్రవేశపెడతారు. బడ్జెట్‌పై చర్చ అనంతరం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ఆమోదించి మండలికి పంపించనున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







