ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ..
- May 20, 2021
న్యూ ఢిల్లీ: కరోనా ఫస్ట్ వేవ్.. ఇప్పుడు సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.మహమ్మారి బారినపడి ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి..తల్లిదండ్రులను కోల్పోయి.. చిన్నారులు అనాథలుగా మిగిలిపోయినవారు ఎంతోమంది..అయితే, అనాథలుగా మారిన చిన్నారులకు భరోసా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రధాని లేఖ రాసిన ఆమె…అనాథలైన చిన్నారులకు ఉచిత విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కోరారు.ఈ విపత్కర, విషాద పరిస్థితుల్లో వారిని ఆదుకుని ఉజ్వల్ భవిష్యత్ అందించాలని కోరిన సోనియా..కోవిడ్ 19తో తల్లిదండ్రులను, కుటుంబంలో సంపాదించే వ్యక్తులను కోల్పోయిన చిన్నారులకు నవోదయ విద్యాలయాల్లో ఉచిత విద్య అందించాలని లేఖలో పేర్కొన్నారు. వారి జీవితంలో అనుకోకుండా నిండిన విషాదం తర్వాత చిన్నారులకు గొప్ప భవిష్యత్తు కోసం ఆశలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక దేశంగా, వారికి సంభవించిన అనూహ్యమైన విషాదం తర్వాత వారికి బలమైన భవిష్యత్తు కోసం ఆశలు కల్పించాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.. ఇక, దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల సృష్టి ఆమె భర్త మరియు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ యొక్క అత్యంత ముఖ్యమైన వారసత్వమని లేఖలో గుర్తు చేశారు సోనియా గాంధీ.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







