కేఫ్, రెస్టారెంట్ల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ

- May 21, 2021 , by Maagulf
కేఫ్, రెస్టారెంట్ల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ

కువైట్ సిటీ: దేశవ్యాప్తంగా కేఫ్, రెస్టారెంట్లను మళ్లీ ప్రారంభించేందుకు కోవిడ్ ఆంక్షలు సడలించిన కువైట్ సుప్రీం కమిటీ..కేఫ్ లు, రెస్టారెంట్ల నిర్వహణకు సంబంధించి కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. సుప్రీం కమిటీ అనుమతి మేరకు ఆదివారం (మే 23) నుంచి రెస్టారెంట్లలో ఇన్ డైనింగ్ సర్వీస్ ప్రారంభం కానుంది. ఉదయం 5 గంటలకు ఇన్ డైనింగ్ సర్వీస్ ప్రారంభించి రాత్రి 8 గంటలకు క్లోజ్ చేయాలని, రాత్రి 8 గంటల తర్వాత డెలివరీ సర్వీస్ అందించొచ్చని కమిటీ తమ గైడ్ లైన్స్ లో స్పష్టం చేసింది. అలాగే కేఫ్, రెస్టారెంట్లకు వెళ్లాలనుకునే వారు ముందుగానే టేబుల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రెస్టారెంట్ల దగ్గర, వేయిటింగ్ హాల్స్ లో వినియోగదారుల రద్దీని తగ్గించేందుకు కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. సోషల్ డిస్టెన్స్ పాటించేలా ప్రతీ టేబుల్ కు రెండు మీటర్ల ఎడం ఉండాలి. ప్రతి వినియోగదారుడ్నీ రెస్టారెంట్లోకి అనుమతించే ముందు అతని టెంపరేచర్ తప్పనిసరిగా చెక్ చేయాలి. బఫెట్ సర్వీస్ పూర్తిగా నిషేధం. అదే సమయంలో రెస్టారెంట్ సిబ్బంది కూడా విధులకు హజరయ్యే ముందే టెంపరేచర్, కోవిడ్ లక్షణాలకు సంబంధించి స్వియ సమీక్ష చేసుకోవాలి. విధులకు హజరయ్యాక కూడా కనీసం ఒకసారైన టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. చేతికి గ్లౌజ్ లు, ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ప్రతి కేఫ్, రెస్టారెంట్లలో డిసిన్ఫెక్షన్ పరికరాలు రెండుకు తక్కువ కాకుండా ఉండాలి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com