పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- January 17, 2026
వెస్ట్ బెంగాల్: రైల్వే ప్రయాణికులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కల నెరవేరింది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. త్వరలోనే పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ తొలి వందే భారత్ స్లీపర్ సర్వీసు ఆ రాష్ట్రంలోనే ప్రారంభించారు. బెంగాల్‌లోని హౌరా నుంచి అస్సాంలోని గౌహతి (కామాఖ్య) మధ్య ఈ వందే భారత్ స్లీపర్ రైలు నడవనుంది.
ఈ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న వేగవంతమైన రైలు అయిన సరైఘాట్ ఎక్స్‌ప్రెస్ కంటే ఈ వందే భారత్ స్లీపర్ రైలు సుమారు 3 గంటల తక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకుంటుంది.హౌరా నుంచి గౌహతి మధ్య ఉన్న 958 కిలోమీటర్ల దూరాన్ని ఈ వందే భారత్ స్లీపర్ కేవలం 14 గంటల్లోనే కవర్ చేస్తుంది. ఈ వందే భారత్ స్లీపర్ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ ప్రస్తుతం 130 కిలోమీటర్ల వేగంతోనే నడపనున్నారు.
సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు హౌరాలో బయలుదేరనున్న ఈ వందే భారత్ స్లీపర్ రైలు మరుసటి రోజు ఉదయం 8 గంటల 20 నిమిషాలకు కామాఖ్య స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కామాఖ్యలో సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటల 15 నిమిషాలకు హౌరాకు చేరుకుంటుంది. హౌరా నుంచి గురువారం తప్ప మిగిలిన 6 రోజులు కామాఖ్య నుంచి బుధవారం తప్ప మిగిలిన 6 రోజులు ఈ వందే భారత్ స్లీపర్ రైలు నడుస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!







