అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- January 17, 2026
హైదరాబాద్: లక్కీ డ్రా పేరుతో అమాయకులను మోసం చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పై హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కార్లు, ప్లాట్లు ఇస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సామాజిక మాధ్యమాల్లో లక్కీ డ్రా పేరుతో జరుగుతున్న మోసాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు.రీల్స్‌లో బిల్డప్…రియాల్టీలో ఫ్రాడ్, లక్కీ డ్రా ఇన్‌ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్త అంటూ ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించారు. లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్లను విశ్వసించవద్దని ప్రజలకు సూచించారు. ఇలాంటి ప్రైజ్ చిట్స్, లక్కీ డ్రాలు నిర్వహించడం భారత రాజ్యాంగం ప్రకారం నేరమని ట్వీట్ చేశారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో వీళ్లు దర్శనమిస్తున్నారు. ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ యాక్ట్-1978 ప్రకారం కేసులు నమోదు చేస్తాం. అమాయకపు ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని నిండా ముంచుతున్న ఇన్ఫ్లూయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. మోసాలకు పాల్పడే వారు సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లైనా సరే.. ఎవరినీ ఉపేక్షించేది లేదు. పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవు. అని సజ్జనార్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









