ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ
- May 21, 2021
గాజా సిటీ: ఇజ్రాయిల్-గాజాల మధ్య గత 11 రోజులుగా యుద్దవాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.గాజాలోని హమాస్ తీవ్రవాదులకు ఇజ్రాయిల్ కు మధ్య భీకరమైన పోరు జరిగింది. జేరూసలెంపై హమాస్ తీవ్రవాదులు కొన్ని వందల రాకెట్లతో దాడులు చేయగా,ఇటు ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది.ఈ దాడిలో దాదాపుగా 200 మంది వరకు పాలస్తీనా పౌరులు మరణించారు.వేలాది మంది నిరాశ్రయులు కాగా,లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.దాడులు ఆపాలని, కాల్పుల విరమణను పాటించాలని ఇజ్రాయిల్ పై ఒత్తిడి రావడం మొదలైంది.ఇజ్రాయిల్ కు మద్దతు ఇచ్చిన అమెరికా సైతం ఈ విషయంలో ఒత్తిడి తీసుకొచ్చింది.ఇస్లామిక్ దేశాలు సైతం ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించింది.ఈ విషయాన్ని హమాస్ ఉగ్రవాద సంస్థ కూడా ధృవీకరించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







