పొన్నాంబ‌ళం చికిత్సకు చిరంజీవి రెండు లక్షల సాయం..!

- May 21, 2021 , by Maagulf
పొన్నాంబ‌ళం చికిత్సకు చిరంజీవి రెండు లక్షల సాయం..!

చెన్నై: మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదారగుణాన్ని చాటుకున్నారు.తమిళ నటుడు పొన్నాంబ‌ళం గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న చిరు...పొన్నాంబ‌ళం బ్యాంకు ఖాతాలోకి రెండు లక్షల రూపాయలను పంపించారు. ఈ విషయాన్ని పొన్నాంబ‌ళం తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.ఈ సందర్భంగా చిరంజీవికి ధన్యవాదాలు తెలిపాడు. 'నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్‌ కోసం రెండులక్షల రూపాయలు పంపినందుకు ధ‌న్యవాదాలు. మీ సహాయాన్ని నేనెప్పటికీ మరచిపోలేను' అని అన్నాడు. కాగా పొన్నాంబ‌ళం గతకొన్నాళ్లుగా మూత్రపిండాల స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్నారు. అటు చిరంజీవి, పొన్నాంబ‌ళం కలిసి ముగ్గురు మొనగాళ్ళు, ఘ‌రానా మొగుడు మొదలగు చిత్రాలలో కలిసి నటించారు. ఇదిలావుండగా ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకుంటున్న తెలుగు సీనియర్ నటి పావలా శ్యామలకి తాజాగా లక్ష రూపాయలు సహాయం చేశారు చిరంజీవి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com