SBI ఖాతాదారులకు అలర్ట్..
- May 21, 2021
SBI ఖాతాదారులు తమ కెవైసి వివరాలను ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా అప్‌డేట్ చేసుకోవడానికి ఎస్‌బిఐ అనుమతిస్తుందని సంస్థ ప్రకటించింది. వినియోగదారులు తమ KYC వివరాలను సమర్పించడానికి బ్రాంచ్ ని సందర్శించాల్సిన అవసరం లేదని 2021 మే 1 న ఎస్బిఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించింది. కోవిడ్ -19 కేసులు పెరగడంతో వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్ల కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు ఎస్బిఐ పేర్కొంది. KYC వివరాలను ఇంటి నుంచి ఎలా అప్‌డేట్ చేయాలి
కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయకపోతే బ్యాంకింగ్ సేవలు పూర్తి స్థాయిలో పొందలేరని, బ్యాంకింగ్ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చని ఎస్బీఐ చెబుతోంది. కాబట్టి ఎస్బీఐ ఖాతాదార్లు అందరూ తప్పనిసరిగా 2021 మే 31 లోగా తమ కేవైసీని అప్డేట్ చేయాలి.ఖాతాదార్లు తమ హోమ్ బ్రాంచ్ లో మాత్రమే కాదు దగ్గర్లోని ఎస్బీఐ బ్రాంచ్ లో కూడా కేవైసీ వివరాలు అప్ డేట్ చేయొచ్చు.భయపెడుతున్న కరోనా మహమ్మారి దానికి తోడు లాక్డౌన్.ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకుకు వెళ్లే పని లేకుండా ఇంటి నుంచే సంబంధిత డాక్యుమెంట్స్ ని ఖాతాదార్లు ఇ మెయిల్ ద్వారా బ్యాంకుకు పంపితే సరిపోతుంది.
తాజా వార్తలు
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం







