తనయుడి నిర్వాకం:గుంటూరు మహిళల సెగ
- March 05, 2016
ఓ మహిళా టీచర్ పట్ల హైదరాబాదులో అసభ్యంగా ప్రవర్తించిన మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు సుశీల్కు వ్యతిరేకంగా గుంటూరులో శనివారంనాడు మహిళలు ఆందోళనకు దిగారు. మంత్రి కుమారుడు సుశీల్ను అరెస్టు చేయాలని కోరుతూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి.
మంత్రి కొడుకైతే అతనికి కొమ్ములుంటాయా.. రాజ్యాంగానికి అతీతుడా అంటూ మహిళలు నినాదాలు చేశారు. మైనారిటీ సంఘాల నాయకులు ఆ నినాదాలతో రాస్తారోకోకు దిగారు. పత్తిపాడులోని ఓల్డ్ మద్రాసు రోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.
రావెల సుశీల్ ఉదంతంపై తెలంగాణ మైనారిటీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషులు ఎంతటివారైనా వారిని వదిలిపెట్టకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మైనారిటీ కమిషన్ చైర్మన్ కోరారు. కాగా, కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని హైదరాబాదు బంజారాహిల్స్ కార్పోరేటర్ విజయలక్ష్మి కోరారు.
బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఆమె చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసేంత వరకు ఊరుకునేది లేదని ఆమె అన్నారు. కాగా, సుశీల్ను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







