ఒకే ఒక్క డోసుతో అవసరమైన ఇమ్యూనిటీ లభించదు
- May 22, 2021
జెడ్డా: ఒకే ఒక్క డోసుతో తగినంత ఇమ్యూనిటీ లభించదని సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. ఖచ్చితంగా రెండో డోస్ కూడా వేసుకుని, కరోనా వైరస్ నుంచి తమను తాము రక్షించుకోవాలని సౌదీలకు హెల్త్ మినిస్ట్రీ సూచించింది. ప్రస్తుతం నాలుగు అనుమతి పొందిన వ్యాక్సిన్లు ఆస్ట్రాజెనకా, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ మరియు మోడెర్నా అందుబాటులో వున్నాయని మినిస్ట్రీ పేర్కొంది. తొలి డోసు తర్వాత కరోనా సోకితే, రెండో డోస్ కోసం కొంత అదనపు సమయం అవసరమవుతుందని మినిస్ట్రీ వెల్లడించింది. కోలుకున్నాక ఆరు నెలల తర్వాతే వ్యాక్సినేషన్ తీసుకోవాలి. పాలిచ్చే తల్లులకు కూడా వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ తలెత్తవని మినిస్ట్రీ అభిప్రాయపడింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇతర వ్యాక్సిన్ల కోసం ఖచ్చితంగా 14 రోజుల గ్యాప్ పాటించాలని మినిస్ట్రీ చెబుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







