భారత్-యూఏఈ మధ్య విమానాలు రద్దు చేసిన విమానసంస్థ
- May 23, 2021
యూఏఈ: భారత్ నుంచి వచ్చే విమానాలపై ట్రావెల్ బ్యాన్ ను తదుపరి ఆదేశాల వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది యూఏఈ. ఈ క్రమంలో, వచ్చే నెల 14 వరకు భారత్ నుంచి విమానాలను అనుమతించబోమని స్పష్టం చేసింది యూఏఈ అధికారిక ఎయిర్లైన్స్ సంస్థ ఎమిరేట్స్. అంతేకాదు..గత 14 రోజుల్లో భారత్ కు వెళ్లిన వారికి...ఇతర ఏ దేశం మీదుగానైనా యూఏఈకి వచ్చేందుకు అనుమతి నిరాకరించబడుతుందని వెల్లడించింది. అయితే..యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యపరమైన పనుల మీద ప్రయాణం చేసేవారు, సవరించిన కోవిడ్ ప్రోటోకాల్ మేరకు ప్రయాణానికి అనుమతించిన వర్గాల వారికి మాత్రం ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు యూఏఈ వెల్లడించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం భారత్ నుంచి యూఏఈకి ప్రయాణాలపై ఆంక్షలు విధించాల్సి వచ్చిందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు కొనసాగుతాయని జాతీయ అత్యవసర, విపత్తుల నిర్వహణ అథారిటీ స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే...భారత్ నుంచి ప్రయాణాల ఆంక్షలు ఉండటంతో యూఏఈకి వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్న విషయం తెలిసిందే. భారత్ నుంచి నేరుగా అనుమతి లేకపోవటంతో ఇతర దేశాలకు వెళ్లి అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి ఆ తర్వాత యూఏఈ వెళ్లాల్సి వస్తోంది. విమానాల రద్దుతో భారత్ లో చిక్కుకున్న వాళ్లంతా తమ ఉద్యోగాలను కొల్పోకముందే యూఏఈ చేరుకునేందుకు ఎక్కువగా అర్మేనియా, బహ్రెయిన్ మీదుగా వెళ్తున్నారు. అయితే..కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అర్మేనియా కూడా భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా ఈ వారంలో ముంబై, కొచ్చి
నుంచి ఆర్మేనియా చేరుకోవాల్సిన రెండు ఛార్టర్ ఫ్లైట్స్ అనుమతులను రద్దు చేస్తున్నట్లు అర్మేనియా ప్రకటించింది. అటు బహ్రెయిన్ కూడా ఆంక్షలు కఠినతరం చేస్తూ వస్తోంది. దీంతో భారత్ నుంచి యూఏఈ వెళ్లే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా కుచించుకుపోతున్నాయి.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







