ప్రవాసీయుల రెసిడెన్సీ పర్మిట్, విజిట్ వీసా గడువు పెంపు

- May 25, 2021 , by Maagulf
ప్రవాసీయుల రెసిడెన్సీ పర్మిట్, విజిట్ వీసా గడువు పెంపు

సౌదీ: సౌదీలో నివాస అనుమతులు ఉన్న ప్రవాసీయులు, సౌదీలో పర్యటించాలని ఇప్పటికే విజిట్ వీసా పొందిన విదేశీయులకు కింగ్డమ్ ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ట్రావెల్ బ్యాన్ కారణంగా ఆయా దేశాల్లో చిక్కుకుపోయి సౌదీకి తిరిగి రాలేకపోయిన ప్రవాసీయుల రెసిడెన్సీ పర్మిట్లను జూన్ 2 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే విజిట్ వీసా పొందిన వారికి కూడా వీసా గడువును జూన్ 2 వరకు పొడిగించినట్లు స్పష్టం చేసింది. గడవు పొడిగింపునకు సంబంధించి ఎలాంటి ఛార్జీలు ఉండవని కూడా క్లారిటీ ఇచ్చింది సౌదీ ప్రభుత్వం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com