కోవిడ్ 19 ఎలక్ట్రానిక్ బ్రాస్లెట్లపై ఫీజు రద్దు
- May 25, 2021
ఒమన్: ఇతర దేశాల నుంచి ఒమన్ కు చేరుకునే వారి కదలికలపై నిఘా వేసేందుకు ఒమన్ ప్రభుత్వం కోవిడ్ 19 ఎలక్ట్రానిక్ బ్రాస్లెట్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే...ఎలక్ట్రానిక్ బ్రాస్లెట్ల కోసం 6 OMRలను వసూలు చేస్తోంది. ఈ ఛార్జీల విషయంలో కొన్ని మార్పులు చేస్తూ ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఒమన్ ఇరుగు పొరుగు దేశాల్లో విధులు నిర్వహించుకొని తిరిగి స్వదేశానికి చేరుకునే వారికి ఎలక్ట్రానిక్ బ్రాస్లెట్ల ఛార్జీ ఉండదని స్పష్టం చేసింది. ల్యాండ్ బోర్డర్ ద్వారా పక్క దేశాల్లో పనులు చేసుకొని వచ్చే వారికి మాత్రమే ఈ మినహాయింపు వర్తించనుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







