కరోనాతో ఉద్యోగి మరణిస్తే... కుటుంబానికి జీతం.. !

- May 25, 2021 , by Maagulf
కరోనాతో ఉద్యోగి మరణిస్తే... కుటుంబానికి జీతం.. !

ముంబై: టాటా స్టీల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపధ్యంలో తమ సంస్థలోని ఉద్యోగులు ఎవరైనా కరోనాతో మరణించినట్లయితే వారి కుటుంబాలకి అండగా నిలబడతామని పేర్కొంది. సోషల్‌ సెక్యూరిటీ స్కీమ్‌ ద్వారా వారికి ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించింది. " టాటా స్టీల్.. ఒకవేళ మా సంస్థలో పనిచేసే ఉద్యోగి కరోనాతో మరణిస్తే... సదరు కుటుంబానికి ఆ ఉద్యోగి మరణించిన నాటికి ఎంత మొత్తమైతే వేతనంగా పొందుతున్నారో అంత మొత్తాన్ని ఆ కుటుంబానికి అందజేస్తాం... ఇది ఆ ఉద్యోగికి 60 సంవత్సరాలు నిండేవరకు అందజేస్తాం. అంతేకాకుండా వైద్య, గృహపరమైన లబ్దిపొందేలా చూసుకుంటాం" అని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com