'మేజర్' విడుదల వాయిదా
- May 26, 2021
హైదరాబాద్: అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా ‘మేజర్’. ముంబై టెర్రరిస్ట్ అటాక్ లో టెర్రరిస్టులను తుదముట్టించే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని తొలుత జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ప్రస్తుతం కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో వారు పునరాలోచనలో పడ్డారు. భారతదేశం గర్వించే ‘మేజర్’ చిత్రాన్ని పరిస్థితులు చక్కబడిన తర్వాత థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నామని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ ప్యాన్ ఇండియా చిత్రాన్ని మలయాళంలోనూ విడుదల చేయబోతున్నారు. ఇందులో శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







