చెన్నై ఎన్నికల సంఘం 'కోడ్' కొరడా ఝళిపిస్తోంది..
- March 05, 2016
ముఖ్యమంత్రి బొమ్మల తొలగింపు గోడలపై రాతలూ, పోస్టర్లు కూడా చెన్నై: ఎ న్నికల సంఘం 'కోడ్' కొరడా అప్పుడే ఝళిపిస్తోంది. తమిళనాడు శాసనసభకు ఎన్నికల షెడ్యూలును ప్రకటించిన ఎన్నికల సంఘం తక్షణమే ఎన్నిక నియమావళి అమల్లోకి వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో శుక్రవారం నుంచే ఈసీ మొత్తం యంత్రాంగాన్ని తన గుప్పెట్లోకి తీసుకుంది. ఎన్నికల నియమావళిని అమలు చేయడం ఆరంభించింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి జయలలిత తొలగించాలని ఈసీ అధికారులకు ఆదేశించింది.దాంతో అధికారులు ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి ఫొటోలను కార్యాలయాల నుంచి తొలగించారు. అలాగే అమ్మా క్యాంటీన్లలోనూ, పలు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన కార్యాలయాల్లో, బస్టాపుల్లోని గోడలమీద ఉన్న ముఖ్యమంత్రి ఫొటోలను తొలగించారు. ఎన్నికల వేళ తమిళనాట గోడలపైన ఇష్టానుసారం అతికించిన పోస్టర్లు, రాతలు, డిజిటల్ బ్యానర్లపైన కూడా ఎన్నికల సంఘం దృష్టి సారించింది. శుక్రవారం నుంచి వాటిని తొలగించే పనులు చేస్తున్నారు. పోస్టర్లు, బ్యానర్లు తొలగింపు కార్యక్రమాల్లో అన్ని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల సిబ్బంది పాల్గొంటున్నారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. గోడలపై రాసిన ప్రచార ప్రకటనలు, పార్టీల రాతలను యుద్ధ ప్రాతిపదికన సున్నంతో చెరిపేస్తున్నామని వెల్లడించారు. వాహనాల తనిఖీలు కూడా శుక్రవారం రాత్రి నుంచే ఆరంభించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.పథకాలు బంద్ మొన్నటివరకూ ప్రజాకర్షక పథకాలతో సందడి చేస్తున్న అధికార పార్టీ పరుగుకు ఎన్నికల సంఘం పగ్గాలు వేసింది. తమిళనాట కొత్తలా ఎలాంటి ప్రజాకర్షక పథకం, ఇతరత్రా ఎలాంటి పథకాలు ప్రకటించరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు మొత్తం కూడా ప్రస్తుతం ఎన్నికల సంఘం నియంత్రణలోకి వచ్చేయడంతో జయ ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంలా మారిపోయింది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం అన్ని ప్రయత్నాలను చేస్తోంది. తొలి రోజు నుంచే ఎన్నికల సంఘం నియమావళి కొరడా ఝళిపిస్తుండటంతో పార్టీలు కంగారెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







