కువైట్ టవర్స్ పై త్రివర్ణ పతాకం..
- May 27, 2021
కువైట్ సిటీ: కోవిడ్ సెకండ్ వేవ్ తో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న భారత్ కు బాసటగా మరోసారి తమ స్నేహశీలతను చాటుకుంది కువైట్. కోవిడ్ మహమ్మారి సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొని కోసం తిరిగి సాధారణ పరిస్థికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ కువైట్ టవర్స్ పై విద్యుత్ కాంతులతో భారత్ జాతీయ జెండాను ప్రదర్శించింది. దేశ చరిత్రలో కువైట్ టవర్స్ పై త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించటం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. కువైట్-భారత్ మధ్య మైత్రి బంధం చాటిచెప్పేలా కువైట్ టవర్స్ పై ఏర్పాటు చేసిన నేషనల్ ఫ్లాగ్ లైటింగ్ ను కువైట్ లోని భారత రాయబార కార్యాలయం తమ అధికారిక ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఇదిలావుంటే..సెకండ్ వేవ్ ఉద్ధృతం అవగానే భారత్ కు సాయం ప్రకటించిన తొలి దేశం కూడా కువైట్ కావటం విశేషం.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







