భారత్‌కు మా మద్దతు కొనసాగుతుంది: కువైట్ విదేశాంగ మంత్రి
- May 29, 2021
కువైట్ సిటీ: మహమ్మారి కరోనాతో పోరాడుతున్న భారత్‌కు తమ మద్దతు కొనసాగుతుందని మరోసారి కువైట్ స్పష్టం చేసింది.ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి డా.షేక్ అహ్మద్ నాజర్ అల్ మహ్మద్ అల్ సబా శుక్రవారం ప్రకటించారు.భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌తో ఫోన్ కాల్లో మాట్లాడిన మహ్మద్ అల్ సబా..ప్రస్తుతం భారత్‌కు కువైట్ అందిస్తున్న సహాయ సహకారాలపై చర్చించారు.ఇప్పటికే భారత్ కు భారీ మొత్తంలో అత్యవసర వైద్య సామాగ్రిని అందించినట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న భారత్‌కు మున్ముందు కూడా తమ పూర్తి మద్దతు ఉంటుందని కువైట్ విదేశాంగ మంత్రి హామీ ఇచ్చారు. విపత్కర సమయంలో చేదోడుగా నిలిచిన కువైట్‌కు మంత్రి జైశంకర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరిచే విషయమై చర్చించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







