రాచకొండ పరిధిలో లాక్‌డౌన్ ప్రశాంతం: సీపీ మహేష్ భగవత్

- May 29, 2021 , by Maagulf
రాచకొండ పరిధిలో లాక్‌డౌన్ ప్రశాంతం: సీపీ మహేష్ భగవత్

హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుందని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఇప్పటి వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 52 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు.5 నేషనల్ హై వే ఉన్నాయని....గూడ్స్ వాహనాలను రాత్రి 9 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు రోడ్ల మీదికి రావాలని తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 12 మే నుండి 56 వేల 466 కేసులు నమోదయ్యాయని చెప్పారు. లాక్‌డౌన్ ఉల్లఘించిన వారిపై 41,990 కేసులు నమోదు చేశామన్నారు. మాస్క్ ధరించని  11,638 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. గ్యాదరింగ్ అయిన వారిపై 601 పైన కేసులు నమోదు చేశామని..1,823 సోషల్ డిస్టన్స్  కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బహిరంగంగా ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై  414 కేసులు నమోదు చేశామని సీపీ అన్నారు.

13,490  వాహనాలు సీజ్ చేశామన్నారు. సూపర్ స్పెడేర్స్‌కు 30 చోట్ల వ్యాక్సినేషన్ నడుస్తోందని తెలిపారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 బెడ్లతో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. చౌటుప్పల్ అనాథ ఆశ్రమంలో 79 మందికి కోవిడ్ వచ్చిందని..వారందరినీ ఐస్ లేషన్‌లో ఉంచామన్నారు. బాలాపూర్‌లో బైక్ గ్యాంగ్‌లో నలుగురిని అరెస్ట్ చేసినట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. 


సరూర్ నగర్ లేక్ ఔట్ పోస్ట్‌లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి వస్తున్నారని...ఇప్పటి వరకు ఆరుగురిని కాపాడినట్లు తెలిపారు.లేక్ ఔట్ పోస్టులో పనిచేస్తున్న మంత్రి ఈశ్వరయ్య 6 గురిని కాపాడారన్నారు. నిన్న శివ కుమార్(26) ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి ని రక్షించారని చెప్పారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవాలనుకునే వారికోసం సెంటర్‌ను ఏర్పాటు చేశామని...సైకాలజీ సెంటర్‌ను రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 040-48214800 కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com