49 రెస్టారెంట్లు, కేఫ్, కేఫటేరియాలకు జరిమానా
- May 29, 2021
దుబాయ్: కమర్షియల్ కంప్లియన్స్ మరియు కన్స్యుమర్ ప్రొటెక్షన్ (సిసిసిపి) విభాగం - దుబాయ్ ఎకానమీ, నిర్దేశిత వేళల తర్వాత నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 49 రెస్టారెంట్లు, కేఫ్స్ అలాగే కేఫటేరియాలకు జరిమానా విధించడం జరిగింది. రాత్రి 1 గంట తర్వాత కూడా వీటిల్లో వినియోగదారులకు అవకాశం కల్పిస్తుండడంతో చర్యలు తీసుకున్నారు అధికారులు. రాత్రి 1 గంట తర్వాత కేవలం డెలివరీ ఆర్డర్స్ కోసం మాత్రమే అనుమతులున్నాయి. అల్ కరామా, జుమైరా, సత్వా, అల్ మురాకాబత్ మరియు అల్ రిక్కా ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. తనిఖీ బృందాలు, నాలుగు స్టోర్లపైనా (మిర్దిఫ్ సిటీ సెంటర్) జరిమానాలు జారీ చేయడం జరిగింది.ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయని ఉల్లంఘనల్ని ఉపేక్షించే ప్రశ్నే లేదని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







