ప్రవాసీయుల స్థానంలో స్థానికులకు ఉద్యోగాలపై కార్మిక శాఖ సమావేశం
- May 30, 2021
ఒమన్: ఒమనైజేషన్ లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తున్న ఒమన్...వలస కార్మీకుల స్థానంలో స్థానికులను భర్తీ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకోసం కార్మిక శాఖ, మానవ వనరుల శాఖ డైరెక్టర్లు సంయుక్త సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంస్థల్లో వీలైనంత మేరకు స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించే అంశంపై చర్చించారు. నిర్ణీత కాలంలో వలస కార్మీకుల స్థానంలో స్థానికులను భర్తీ చేసేలా లక్ష్యాలను నిర్దేశించుకొని..డెడ్ లైన్ లోగా ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన ప్రణాళికపై సమీక్షించారు. అలాగే డెడ్ లైన్ లోగా ఆయా సంస్థల అవసరాలకు అనుగుణంగా టెంపరరీ కాంట్రాక్ట్ వర్కర్ల నియామకాలను చేపట్టాలని ఈ సమావేశం నిర్ణయించింది. సుల్తాన్ హైతమ్ బిన్ తారీక్ రాజ ఉత్తర్వ్యులకు అనుగుణంగా గవర్నమెంట్ యూనిట్స్ లో నిర్దేశించుకున్న కాలవ్యవధిలోగా ఒమనీలను భర్తీ చేసుకోవాల్సిన ఆవశ్యతపై కార్మిక శాఖ, మానవ వనరుల శాఖ అధికారులు ఈ సమావేశంలో ప్రస్తావించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







